భక్తి ఉద్యమం - GNANA SAMHITHA

GNANA SAMHITHA

Telugu lo fast, simple, and reliable updates on education, technology, jobs, current affairs, lifestyle and daily useful information. Trusted news & knowledge platform.

Breaking

Post Top Ad

Thursday, March 20, 2025

భక్తి ఉద్యమం

👉🏻భక్తి మార్గ ముఖ్య సిద్ధాంతం-భగవంతుని పట్ల అచంచలమైన భక్తిని కలిగిఉండడం.
👉🏻భక్తి 9 రకాలు (నవవిధ భక్తి)
1 శ్రవణ భక్తి
2 కీర్తనా భక్తి
3 స్మరణ భక్తి
4 పాదసేవన భక్తి
5‌ అర్చన భక్తి
6 వందన భక్తి
7 దాస్వ భక్తి
8 సఖ్య భక్తి
9 ఆత్మ నివేదన భక్తి

👉🏻భక్తి ఉద్యమ ప్రధాన లక్షణాలు
1 ఏకేశ్వరోపాసన
2 విగ్రహారాధన వ్వతిరేకత
3 కుల వ్యవస్త ఖండన
4 మత కర్మకాండలు, తీర్థయాత్రల పట్ల నిరసన
5 ప్రాంతీయ భాషల్లో బోధన
6 హిందూ మహమ్మదీయుల ఐక్యత

1) శంకరాచార్య:
👉🏻ఇతను కేరళలో కాలడి వద్ద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.
👉🏻ఇతని బిరుదులు
1) ఆదిగురు
2) ప్రచ్చన్న బుద్ద/ క్రిప్టోబుద్ద
vఇతను అద్వైత వేదంను బోధించాడు.
ఇతని గురువు గోవిందపాల
👉🏻ఇతను 4 దిక్కులలో 4 మఠాలు ఏర్పాటు చేశాడు.
ఉత్తరం - బద్రీనాథ్‌
దక్షిణం - శృంగేరి
తూర్పు - పూరి
పశ్చిమ - ద్వారకా
👉🏻ఇతని మరణానంతరం ఇతని శిష్యులు కంచీ మఠంను స్థాపించారు.

2) రామానుజాచార్య:
👉🏻ఇతను తమిళనాడులోని శ్రీపెరంబూర్‌ లో జన్మించాడు.
👉🏻ఇతను భక్తి ఉద్యమ నిజమైన స్థాపకుడు
👉🏻చోళ రాజులతో వివాదం ఏర్పడి రామానుజులు చోళరాజ్యం వదిలి మహారాష్ట్ర చేరుకున్నాడు.
👉🏻మహారాష్టలోని వండరీవూర్‌లో గల విరోభా దేవాలయాన్ని ఆధారంగా చేసుకొని భక్తి ఉద్యమ వ్యాప్తి చేశాడు
👉🏻తను విశిష్ట అద్వైతంను బోధించాడు
👉🏻ఇతను శ్రీ వైష్ణవ తెగను స్థాపించాడు

3) మద్వాచార్య:
👉🏻ఇతను కర్ణాటకలోని కెనరాలో జన్మించాడు
vఇతను ద్వైత తత్వంను బోధించాడు

4) రామానంద:
👉🏻ఇతను ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగలో జన్మించాడు
👉🏻ఇతని గురువు రాఘవానంద
👉🏻ఇతను శ్రీరాముని భక్తుడు
👉🏻ఇతను మొదటిసారిగాహిందీ భాషలో బోధించిన భక్తి ఉద్యమకారుడు.
👉🏻ఇతని శిష్యులు
1) కబీర్‌ (నేతపనివాడు)
2) రాయదాస (చెప్పులు కుట్టేవాడు)
3) సేనదాస (మంగలివాడు)
4) పీప (రాజపుత్రుడు)

5) వల్లభాచార్యుడు:
👉🏻ఇతను ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జన్మించాడు
👉🏻ఇతను శుద్దాద్వైతంను బోధించాడు
👉🏻ఇతని బిరుదు - ఎపిక్యురియన్‌ ఆఫ్‌ ద ఈస్ట్‌

6) బసవ:
👉🏻ఇతను కర్ణాటకలో బిజ్జల రాజ్యానికి ప్రధాని
👉🏻ఇతను వీర శైవిజమ్‌ను స్థాపించాడు
👉🏻ఈ మతాన్ని పాటించేవారిని లింగాయతులు అంటారు.
👉🏻వీరి గురువులను జంగములు అంటారు
👉🏻వీరి మత పుస్తకాలను అగములు అంటారు
👉🏻ఈ మతం సాంఘిక సంస్కరణలు బోధించింది. 👉🏻ఉదా!
1) వితంతు వివాహం జరగాలి
2) బాల్య వివాహాలు నిషేధం మొదలగునవి

నిర్గుణ - సుగుణ

👉🏻మధ్య యుగంలో భక్తి ఉద్యమం రెండుగా చీలిపోయింది. 1) నిర్గుణ 2) సుగుణ

నిర్గుణ

👉🏻దేవునికి రూపం లేదు, విగ్రహారాధన చేయరాదు, తీర్థయాత్రలు చేయరాదు అని వీరు చెప్పేవారు 👉🏻నిర్గుణ సన్యాసులలో ముఖ్యులు - 1. కబీర్ 2. గురునానక్‌ 3. దాదుదయాల్‌ 1) కబీర్‌ :
•ఇతనిని మధ్యయుగ కారల్‌మార్క్స్ అంటారు
•ఇతను హిందూ, ముస్లిం కలయికను ప్రోత్సహించాడు
•లౌకికవాదంను బోధించాడు
•రామ్‌ రహీం ఒకే నాణెం యొక్క రెండు రూపాలని చెప్పాడు.
•హిందువులు, మహమ్మదీయులు ఒకే మట్టితో తయారైన కుండలు అని కబీర్‌ వ్యాఖ్యానించాడు.
•'హృదయం నిష్కల్మషంగా లేనపుడు, రాతిని పూజించడం వల్ల, గంగానదిలో స్నానం చేయడం వల్ల లాభమేమి? మోసబుద్ధితో, అపవిత్రమైన హృదయంతో కాబా వైపు నడిస్తే మక్కసందర్శించడం వల్ల ప్రయోజనమేమి? అని కబీర్‌ ప్రశ్నించాడు.
•ఇతను సికిందర్‌ లోడికి సమకాలీనుడు.
•ఇతను వమధ్యవదేళ్‌లో వీరనింవా బాగేల్‌ (బుందేల్‌ఖాండ్‌)కు సమకాలీకుడు.
•ఇతను అత్యధికంగా విగ్రహారాధనను ఖండించాడు
•ఇతని బోధనలు దోవాస్‌ అనే గ్రంథంలో సేకరించబడ్డాయి. దీనిలో సిఖిస్‌, బిజాంటి అనే భాగాలున్నాయి.
•మరణానంతరం అతని మృతదేహంపై ఉన్న పూలను హిందువులు వారణాసి వద్ధ, ముస్లింలు మగర్‌ (గోరఖ్‌పూర్‌)లో పూడ్చారు.

2) గురునానక్‌:
•ఇతను 1469లో పంజాబ్‌(పాక్‌)లోని తాల్వండి (నంకానాసాహెబ్)‌లో ఖత్రి కుటుంబంలో జన్మించాడు.
•ఇతను సిక్కు మత స్థాపకుడు
•లౌకికత్వంను బోధించాడు
•ఇతను అనేకసార్లు మక్కాను సందర్శించాడు.
•పద్య రూపంలో ఉన్న అతని బోధనలు ఆదిగ్రంథ్‌గా సంకలనం చేశారు. ఆదిగ్రంథ్‌ సిక్కుల పవిత్ర గ్రంథం.
•హిందూ-మహమ్మదీయ సమైక్యత నానక్‌ జీవితాశయం. భగవంతుడొక్కడే అని ప్రకటించి, హిందువులు, మహమ్మదీయుల మధ్య భేదాలు తగ్గించడానికి ప్రయత్నం చేశాడు. తనకు తాను గురువుగా ప్రకటించుకున్న వెంటనే హిందువు లేడు, మహమ్మదీయుడు లేడు అని నానక్‌ ప్రకటించాడు. అలా ప్రకటించడానికి అతని ఉద్దేశం వారి మధ్య విభేదాలు లేకుండా చేయాలని.
•తన అనుచరులందరూ కుల విభేదాలను విస్మరించి, అందరూ కలసి ఉమ్మడి భోజనశాలలో (అంగర్‌) భోజనం చేయాలని ఆదేశించాడు.
•సిక్కు మతస్తులందరు 'ఖిల్సా'గా వ్యవస్థీకరించబడ్డారు. “ఖల్సా” అంటే 'పవిత్రమైన' అని అర్ధం.
•ఇతని అనుచరులు సిక్కులు” అని పిలవబడ్డారు. సిక్కులు అనగా శిష్యులు”.
•ఇతని సంగీత వాయిద్యం -రబాబ్‌
•ఇతని ప్రధాన శిష్యుడు -మదనా
•ఇతని తర్వాత 9 మంది సిక్కు గురువులున్నారు.

3) దాదుదయాళ్‌:
•ఇతను గుజరాత్‌లో బోధించాడు
•ఇతని శిష్యులను నిపక్‌పాంథీలు అంటారు/ దాదుపాంథీలు అంటారు.
•ఇతని బోధనలు పన్నీ అనే పుస్తకంలో సేకరించబడ్డాయి.

4) రాయదాస:
•ఇతను వారణాసిలో చెప్పులు కుట్టుకునేవాడు
•ఇతని ప్రధాన శిష్యురాలు - రాణీ షాలి

సగుణ సన్యాసులు:

•దేవునికి రూపం ఉంది, విగ్రహారాధన, తీర్థయాత్రలు చేయాలని చెప్పారు.
•ముఖ్యమైనవాడు -సూర్‌దాస్‌
•వీరు ప్రధానంగా 3 ప్రాంతాలలో ఉండేవారు.
1) మరాఠా వైష్ణవిజమ్‌ (మహారాష్ట్ర)
2) గౌడ వైష్ణవిజమ్‌ (బెంగాల్‌)
3) ఆళ్వారులు నాయనార్లు (దక్షిణ భారతదేశం)

మరాఠా వైష్ణవిజమ్‌:
•మహారాష్ట్రలో భక్తి ఉద్యమంవ్యాప్తి చేసింది -రామానుజాచార్యుడు.
•పండరీపూర్‌లో విఠోభా దేవాలయం ఆధారంగా భక్తి ఉద్యమం వ్యాప్తి చెందింది.
•భక్తి ఉద్యమకారులు రెండు
1) ధారకారీ
2) వారకారీ
ధారకారీ:
•వీరు పండరీపూర్‌కి సంవత్సరానికి ఒకసారి తీర్థయాత్ర చేసేవారు.
•ముఖ్యమైన భక్తి సన్యాసి -రామదాసు
•ఇతను శివాజీ మత గురువు
•రామదాసు యొక్క కాషాయ వస్త్రాన్ని తన అధికారిక పతాకమని శివాజీ ప్రకటించాడు.
•రామదాసు దశబోధ అనే పుస్తకాన్ని రచించాడు.
వారకారీ:
•వీరు సంవత్సరానికి రెండు సార్లు పండరీపూర్‌కి తీర్థయాత్రకి వెళ్లేవారు.
•జ్ఞానేశ్వర్‌: ఇతను జ్ఞానేశ్వరి/అమృత అనుభవ్‌ పుస్తకాన్ని రచించాడు.
నామదేవుడు:
•ఇతను మొదట్లో హత్యలు, దారిదోపిడీలు చేసేవాడు.
•ఇతను దర్జీ కుటుంబంలో జన్మించాడు.
•మహామ్మదీయ మతంచే ప్రభావితుడయ్యాడు.
•ప్రేమ సందేశాన్ని ప్రబోధించాడు. కుల వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించాడు.
•మహమ్మదీయ మతంచే ప్రభావితుడయ్యాడు. దేవుడు ఒక్కడే అనే సిద్ధాంతానికి ప్రాముఖ్యతనిచ్చి విగ్రహారాధన, కుల వ్యవస్థను తీవ్రంగా ఖండించారు.
•ఇతను అనేక 'అభంగాలు” రాశాడు
•ఏక్‌నాముడు/ఏక్‌నాథ్‌: ఇతను భగవద్గీతపై అనేక వ్యాఖ్యానాలు రచించాడు.
తుకారాం:
•ఇతను మొదట్లో సూఫి సన్యాసి తరువాత భక్తి సన్యాసిగా మారి మొత్తం మహారాష్ట్ర భక్తి సన్యాసులలో అతి గొప్పవాడుగా పేరుపొందాడు. ఇతను శివాజీ, జవాంగీర్‌, షాజహాన్‌కు సమకాలీకుడు.
•ఇతన్ని మరాఠ కబీర్‌ అంటారు. మరాఠ భక్తి ఉద్యమాలపై వాఖ్యలు రాశాడు.

గౌడ వైష్ణవిజమ్‌:
చైతన్యుడు:
•ఇతని అసలు పేరు విశ్వాంబర మిశ్రా.
•ఇతని గురువు కేశవ భారతి
•భక్తి ఉద్యమకారులలో ఇతనికి అత్యధికంగా శిష్యులు ఉన్నారు

•ఇతని ఆత్మకథ “చైతన్య చరితామృతం”ను కృష్ణదాస కవిరాజా రచించాడు. •ఇతను బెంగాలీ, అస్సామీ, ఒరియా భాషలలో బోధించాడు.
•ఇతను 'హరేరామ హరేకృష్ణ నినాదం ఇచ్చాడు ఇతను తనకు తాను కృష్ణుని అవతారమని ప్రకటించుకున్నాడు.
•ఇతను “అచ్చింత బేదవాద' సిద్ధాంతమును బోధించాడు.
•చైతన్యుడు 'రాగమార్గం' మోక్షానికి ఉత్తమ మార్గమనే సందేశాన్ని ప్రచారం చేశాడు.
•విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని ప్రబోధించాడు.
•బెంగాల్‌, ఒరిస్సాల్లో చైతన్యుని అనుచరులు వేల సంఖ్యలో ఉన్నారు.
చండిదాస:
•ఇతను జయదేవుని గీత గోవిందంతో, బౌద్ధ మతానికి చెందిన సహాజియా తెగతో ప్రభావితమై భక్తి సన్యాసిగా మారాడు.
•ఇతను చిరుతలకు / చెక్క భజనకు ప్రసిద్ధి.

ఆళ్వార్లు, నాయనార్లు:
ఆళ్వార్లు;
•వీరి సాహిత్యాన్ని ప్రబంధాలు అంటారు. వైష్ణవ్రులను ఆళ్వార్లు అంటారు
•12 మంది ఆళ్వార్ల గురువులు ఉన్నారు. ముఖ్యమైనవారు: రామానుజాచార్య, నింబార్మర్‌, తిరువళ్ళువర్‌ మొదలగువారు.
•నింబార్కర్‌ ద్వైత అద్వైతం బోధించాడు. ఇతను 'వేదాంత పారిజాతసౌరభి పుస్తకాన్ని రచించాడు
•ఇతను కృష్ణ భగవానుడి పరమ భక్తుడు.
నాయనార్లు:
•శైవులను నాయనార్లు అంటారు. వీరి సాహిత్యాన్ని 'తేవరమ్‌” అంటారు.
•63 మంది నాయనార్ల గురువులు ఉన్నారు
•ముఖ్యమైన గురువు -మెకాండర్‌. ఇతను శివజ్ఞాన బోధి పుస్తకాన్ని రచించాడు. ఇతను అగామిక్‌ శైవ తెగను స్థాపించాడు.

ఇతర భక్తి సన్యాసులు:
•శంకర్‌దేవ - అస్సాం
•లల్లా - కాశ్మీర్
•మీరాబాయి - చితోర్‌.
ఈమె రాణా సంగ్రామ్‌ సింగ్‌ పెద్ద కుమారుడైన భోజ్‌ రాజ్‌ భార్య. ఈమె తన మరిది విక్రమ్‌సింగ్‌ నుండి అనేక కష్టాలు ఎదుర్కొంది.
-భోజ్‌ రాజ్‌ మరణానంతరం ఈమె శ్రీకృష్ణుని భక్తురాలిగా మారి శ్రీకృష్ణుని పై అనేక కీర్తనలు ఆలపించింది.
-ఈమె సంగీత వాయిద్యం ఏకతార. ఈమె కీర్తనలు పదావళి అనే పుస్తకంలో సేకరించబడ్డాయి
-ఈమె కృష్ణుని భక్తురాలు.
•సూరదాస్‌ - ఆగ్రాలో బోధించాడు
-ఇతనిని ఆగ్రా అందకవి అంటారు.
-ఇతను సూర్‌సాగర్‌, సూర్‌సరవాళి, సాహిత్యరత్సు సుందర విలాసం అనే గ్రంథాలు రచించాడు.
-సూర్‌ సాగర్‌లో శ్రీకృష్ణుని జన్మ నుంచి అతను మధురకు బయులుదేనే వరకు గల కథ పేర్కొనబడింది.
•గోరఖ్‌నాథ్‌ - ఉత్తరప్రదేశ్‌లో బోధించాడు. ఇతని శిష్యులను నాథ్‌పాంతీలు అంటారు.
•నరసింహం - గుజరాత్‌లో బోధించాడు.
•నాభాజీ - భక్తమాల అనే పుస్తకం రచించాడు. ఇది మధ్యయుగ సన్యాసుల గూర్చి వివరిస్తుంది.
•తులసీదాస్‌ - రామచరిత మానస్‌ రచించాడు. (అక్బర్‌ సమకాలీకుడు)

సూఫీ ఉద్యమం

•'సూఫీ' అంటే “ఉన్ని అని అర్థం. ప్రేమతో మానవుడు భగవంతునిలో లీనం కాగలడన్నదే సూఫీ మత ముఖ్య సిద్ధాంతం.
•దైవసాన్నిధ్య భావనను సృష్టించడానికి సంగీత ప్రాముఖ్యం గల పాటలను 'సమాస్‌/ నమాజ్ను అనుసరించడం ద్వారా వీరు ప్రజాదరణ పొందారు.
•సూఫి అనే పేరు మొదటిసారిగా అబుహషీంకు ఉపయోగించారు.
•ఇతను కుఫా(ఇరాక్‌)కి చెందినవాడు.
•మొట్టమొదటి మహిళా సూఫీ సన్యాసిని -రబియా(ఇరాక్‌)
•ఇ భారతదేశంలో సూఫీ ఉద్యమ వ్యాప్తి చేసినవారు - మొయినోద్దీన్‌ చిస్టీ

చిస్థీ :
•ప్రధాన కేంద్రం -అజ్మీర్‌
•స్థాపకుడు... - మొయినోద్దీన్‌ చిస్థీ(1143-1236)
•బిరుదు - ఖ్వాజా గరీబుద్దీన్‌ / ఖ్వాజాగరిబ్‌ ఉన్‌ నవాబ్‌
•మొయినోద్దీన్‌ చిస్ట్‌ పృథ్వీరాజ్‌ చౌహాన్‌ కాలంలో ఇండియా వచ్చాడు.
•ఇతను అజ్మీర్‌లో స్థిరపడ్డాడు. •ప్రసిద్ధ చరిత్రకారుడు జియావుద్దీన్‌ బరౌని, సుప్రసిద్ధ కవి అమీర్‌ఖుప్రోలతో సహా అనేకమంది మొయినోద్దీన్‌ చిస్థీ అనుచరులైనారు.
•ఇతర చిస్థీ సన్యాసులు:
1) కుతుబుద్దీన్‌ భక్తియార్‌ కాకి
2) హమీద్‌ ఉద్దీన్‌ నగౌరీ
3) బాబా ఫరీద్‌ (గంజ్‌-ఇ-షికర్‌) -1175-1265 (ఇతని బోధనలు ఆదిగ్రంథ్‌లో చేర్చబడ్డాయి)
4) నిజాముద్దీన్‌ బెలియా (ఏడుగురి ఢిల్లీ సుల్తానుల పాలనను చూశాడు, ఇతను యోగాసనాలను పాటించాడు). ఇతను ఢిల్లీ సుల్తానుల నుండి బహుమానాలు స్వీకరించాడు. యోగీలు ఇతన్ని సిద్‌ అని పిలిచేవారు.
3‌) నసీరుద్దీన్‌ -చిరాగ్‌-ఇ-దెహ్లవీ (లైట్‌ ఆఫ్‌ ఢిల్లీ)

సుహ్రవాదీ :
•ప్రధాన కేంద్రం -ముల్తాన్‌
•స్థాపకుడు. - బహావద్దీన్‌ జకారియా (బాబా ఫరీద్‌కు సమకాలికుడు)
•ఇతను వైభవంగా, విలాసవంతంగా జీవించాలని చెప్పాడు.
•సుహ్రావాది తెగ అనేక శాఖలుగా చీలిపోయింది. అవి
1. ముల్తాన్‌ శాఖ
2.ఉచ్చా శాఖ-మొహమ్మద్‌ బిన్‌ తుగ్లక్‌ దీన్ని అత్యధికంగా గౌరవించాడు.
3. ఫిరదౌసియా

కాద్రీ :
•స్థాపకులు - షానయామ తుల్లా ,ముక్దుం మహ్మద్‌ జిలానీ
•నక్షా బందీ : బాకీ బిల్లా
•సూఫీ తెగలను సిల్‌సిలాలు అంటారు.
•ఇ అబుల్‌ ఫజల్‌ తన ఐనీ అక్బరీలో 16 సిల్‌సిలాలు గురించి పేర్కొన్నాడు.

No comments:

Post a Comment

Post Bottom Ad